Header Banner

లక్నోలో నేడు ఆర్సీబీ, సన్‌రైజర్స్ మధ్య ఐపీఎల్ పోరు! ఆర్సీబీ జట్టు ఇప్పటికే..

  Fri May 23, 2025 20:19        Sports

ఐపీఎల్ లో నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ), సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) జట్ల మధ్యమ్యాచ్ జరగనుంది. లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకానా క్రికెట్ స్టేడియం ఈ కీలక పోరుకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్‌సీబీ తాత్కాలిక కెప్టెన్ జితేష్ శర్మ తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో గెలిస్తే ఆర్‌సీబీ దాదాపుగా టాప్-2 స్థానాన్ని ఖాయం చేసుకుంటుంది. ఇప్పటికే నిరాశాజనకమైన ప్రదర్శనతో సతమతమవుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్, ఈ మ్యాచ్‌లో గెలిచి, ఆదివారం నాడు కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగే తమ చివరి లీగ్ మ్యాచ్‌కు ముందు కొంత ఆత్మవిశ్వాసం పొందాలని భావిస్తోంది. ఆర్సీబీ జట్టు ఇప్పటికే ప్లే ఆఫ్స్ చేరగా, సన్ రైజర్స్ ఎలిమినేట్ అయింది. లక్నో పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందని అంచనా. ఆరంభంలో బౌలర్లకు కొద్దిగా సహకరించినా, మొత్తంగా బ్యాటర్లకు పండుగే అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఫ్లడ్‌లైట్ల వెలుతురులో పిచ్ మరింత మెరుగ్గా స్పందించే అవకాశం ఉంది. దీంతో టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవడానికే మొగ్గుచూపుతుంది. ఇక వాతావరణం విషయానికొస్తే, లక్నోలో వాతావరణం వేడిగా, ఉక్కపోతగా ఉంటుందని, వర్షానికి ఆస్కారం లేదని తెలుస్తోంది.

 

ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు అదిరిపోయే వార్త.. కొత్తగా కేబుల్ బ్రిడ్జ్! రూట్ లోనే ఫిక్స్ - నేషనల్ హైవేకు దగ్గరగా.!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం.. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషితో చంద్రబాబు భేటీ!

 

హార్వర్డ్‌కు ట్రంప్ సర్కార్ షాక్! అంతర్జాతీయ విద్యార్థుల ప్రవేశంపై నిషేధం!

 

గోల్డ్ లవర్స్ ఇక కొనేసేయండి..! బంగారం ధర తగ్గిందోచ్.. ఎంతంటే.?

 

వైసీపీ మాజీ మంత్రికి అష్టదిగ్బంధన! లుక్ అవుట్ నోటీసులు జారీ!

 

వామ్మో.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. దెబ్బకు మళ్లీ లక్షకు చేరువలో!

 

స్కూల్ బస్సుపై సూసైడ్ బాంబ్! నలుగురు చిన్నారులు స్పాట్.. 38 మందికి సీరియస్!

 

జగన్‌ను కోర్టుకు రప్పిస్తా! అప్పటి వరకు నిద్రపోను!

 

విజయవాడలో మరో ఇంటిగ్రేటెడ్‌ బస్​ టెర్మినల్‌..! పీఎన్‌బీఎస్‌పై తగ్గనున్న ఒత్తిడి!

 

ఢిల్లీ పర్యటనకు చంద్రబాబు.. నెల రోజుల్లో రెండోసారి! ఈసారి ఎందుకు వెళుతున్నారంటే?

 

ఖరీఫ్ సాగు లక్ష్యంగా మంత్రి అచ్చెన్న కీలక మార్గదర్శనం! రైతు సంక్షేమమే టార్గెట్!

 

టీటీడీలో కీలక నియామకాలు! ఏరి కోరి.. వారి మార్గదర్శకంలోనే ఇక!

 

ఏపీ రైతులకు శుభవార్త.. ఈ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు! వెంటనే దరఖాస్తు చేయండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Sports #teamindia